ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్ విభాగ నెట్వర్క్ ను మరింతగా విస్తరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు త్వరలోనే పార్శిళ్లను ఇంటి వద్దనే పికప్, డెలివరీ చేస్తామని చెప్పారు.
హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో ఇవాళ(గురువారం) నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ మోడల్ కౌంటర్‌ను ప్రారంభించారు. కొత్త కౌంటర్ లో ఒక పార్శిల్ ను బుకింగ్ చేసి రశీదును వినియోగదారుడు శివ కుమార్‌కు ఆయన అందజేశారు. తర్వాత లాజిస్టిక్స్ విభాగ కొత్త లోగో, బ్రోచర్ ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. పార్శిళ్ల హోం పికప్, డెలివరీ కోసం వినియోగించే కొత్త వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం తెలంగాణలో అతివేగంగా పార్శిళ్లను డెలివరీ చేసే వ్యవస్థ అని అన్నారు. ప్రతి రోజు సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నామని తెలిపారు వీసీ సజ్జనార్.
ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించిన సంస్థ..ప్రైవేట్ మార్కెట్‌కు ధీటుగా లాజిస్టిక్స్ విభాగాన్ని బలోపేతం చేస్తున్నదని తెలిపారు వీసీ సజ్జనార్. లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నంబర్ 040-69440069 గానీ, https://www.tsrtclogistics.in వెబ్‌సైట్‌ను లాగిన్ కావాల్సిందిగా సూచించారు.
ఇది కూడా చదవండి: రాజ్యసభ ఎంపీగా సుధా మూర్తి ప్రమాణ స్వీకారం
The post పార్శిళ్లు ఇంటి వద్దనే పికప్, డెలివరీ appeared first on tnewstelugu.com.
