జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఇవాళ ఉదయం నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైనట్లు సమాచారం. మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.పుల్వామా జిల్లాలోని అర్షిపోరా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు ప్రారంభించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతీకార చర్యలో ఒక ఉగ్రవాది హతమవగా, మరొకరిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా దళాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇటీవల, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సరిహద్దు జిల్లాలైన రాజౌరి,చ్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాద మాడ్యూల్‌ను ఛేదించారు. ఈ మాడ్యూల్‌లోని ఏడుగురిని గుర్తించారు, వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు.వీరంతా సరిహద్దుల ఆవల నుంచి జిల్లాలో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, నగదు, మాదకద్రవ్యాలను స్వీకరించడం, అక్రమ రవాణా చేయడంలో పాలుపంచుకున్నారు. పాకిస్థాన్‌లో ఉన్న ఈ మాడ్యూల్‌కు చెందిన నాయకుడు, లష్కరే తోయిబాకు చెందిన మహ్మద్ ఖాసిం కోసం పోలీసులు రూ.10 లక్షల రివార్డుతో పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: ఎండాకాలం కుక్కలతో జర జాగ్రత్త.. కుక్క కరిచిన వెంటనే ఇలా చేయండి
The post పుల్వామాలో భారీ ఎన్ కౌంటర్..ఉగ్రవాది హతం.! appeared first on tnewstelugu.com.