చిదంబరం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మరోసారి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన పన్నును పెంచి ప్రజలపై పన్ను భారం మోపిందని ఆరోపించారు.

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన పన్నును పెంచి ప్రజలపై పన్ను భారం మోపిందని ఆరోపించారు. ప్రజలకు ఖర్చులు పెంచి కేంద్రం లాభాలను రాబట్టుతోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇంధన పన్నును పెంచడం వల్ల ఇంధన ధరలు పెరుగుతున్నాయని, ఇది అంతిమంగా వినియోగదారుల జేబులకు చిల్లు పడుతుందని చిదంబరం అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రజలకు బహిర్గతం చేయడం లేదని, ఇంధన ధరల పెంపుపై పన్నులు వేస్తోందని, పెట్రో ధరల పెంపుదలను కప్పిపుచ్చేందుకు ప్రజల ప్రయోజనాలను దోచుకుంటున్నారని విమర్శించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత దేశంలో ముడిచమురు ధర పెరిగిందని, ఇంధన ధరలు పెంచేందుకు దీనిని సాకుగా చూపారని చిదంబరం అన్నారు. అప్పటి నుంచి ముడిచమురు ధర తగ్గుముఖం పట్టిందని, కానీ దాని ప్రయోజనాలు సామాన్యులకు అందడం లేదని వాపోయారు.
