
హనుమకొండ: హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఆ మహిళ గొంతు కోసుకుంది. కాజీపేట మండలం కపిడికొండకు చెందిన శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆమె వేరే మతం కావడంతో అతడు మతం మారాడు. అయితే వీరి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఆమె పెళ్లికి కూడా అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆ క్రమంలో మంగళవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లిన శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. యువతి గొంతు, చేతులు కోసేశాడు. ఆమెను అడ్డుకున్న కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన యువతిని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
