ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ( సోమవారం) ఘాజీపూర్‌లో విద్యుత్ వైర్లు తగిలి పెళ్లి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఇది కూడా చదవండి: ఫుడ్ కలర్ వాడిన మంచూరియా, పీచుమిఠాయిలు నిషేధం
The post పెళ్లి బస్సులో మంటలు.. ఐదుగురు సజీవదహనం appeared first on tnewstelugu.com.
