తమ పేరెంట్స్ ను జీవితంలో ఒక్క సారైనా విమానం ఎక్కించాలనే కోరిక చాలామందికి ఉంటుంది. వారు గర్వపడేలా చేయాలకుంటారు. ఇలాంటి స్వప్నాన్నే నిజం చేస్తూ.. ప్రదీప్ కృష్ణన్ అనే ఓ విమాన పైలట్ తన ఇంటి సభ్యులకు ఊహించని బహుమతి ఇచ్చాడు. తన ఫ్లైట్‌లోనే ప్రయాణిస్తున్న తల్లి, గ్రాండ్ పేరెంట్స్ విషయంలో స్పెషల్ అనౌన్స్ మెంట్ చేసి, వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో భావోద్వేగానికి గురైన ఆ పైలట్ తల్లి ఎమోషనల్ అయ్యారు.
‘‘చెన్నై- కోయంబత్తూరు విమానంలో ఈరోజు మా అమ్మ, తాత, బామ్మ నాతో కలిసి ప్రయాణిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మా తాత ఈ రోజే మొదటిసారి నాతో విమానంలో ప్రయాణిస్తున్నారు. గతంలో ఆయన నన్ను ఎన్నో సార్లు తన స్కూటర్‌పై తిప్పారు. బదులుగా ఇప్పుడు ఆయన్ను నా డ్రైవింగ్ లో తాతను విమానంలో తీస్కెళ్తున్నా’’ అని కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ తన అనౌన్స్ మెంట్ చేశారు. తన కుటుంబ సభ్యులను ప్రయాణికులకు పరిచయం చేశారు. ఈ భావోద్వేగ క్షణంతో వారి కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి.
ఇది కూడా చదవండి: అతిగా శానిటైజర్‌ను వాడుతున్నారా..? అయితే ప్రమాదం తప్పదు
The post పైలట్ స్పెషల్ అనౌన్స్ మెంట్.. తల్లి కంటతడి appeared first on tnewstelugu.com.