ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టి ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూస్తామన్నారు మాజీ, మంత్రి సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్. ఇవాళ(మంగళవారం) రాంగోపాల్‌పేట్ డివిజన్లోని పీజీ రోడ్డులో ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను స్థానికులు తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా డిమ్మీ పాన్‌షాపు నుంచి రామ మందిరం వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేశామని, త్వరలోనే పనులు చేపడతామని చెప్పారు.
ఇది కూడా చదవండి:హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్ పొడిగింపు
