
మనీలా: ఫిలిప్పీన్స్‌లో పెను విపత్తు తప్పింది. కొరియన్ ఎయిర్‌కు చెందిన విమానం ల్యాండింగ్‌లో రన్‌వే మీదుగా ఎగిరింది. విమానం ముందు భాగం ధ్వంసమైంది. అయితే ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొరియన్ ఎయిర్‌కు చెందిన ఎయిర్‌బస్ KE631 విమానం 173 మందితో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నుండి ఫిలిప్పీన్స్‌కు వెళుతోంది. ఆ క్రమంలో ఫిలిప్పీన్స్‌లోని సెబు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.
కానీ ప్రతికూల వాతావరణం కారణంగా అది రన్‌వే మీదుగా ఎగిరిపోయింది. విమానం ముందు భాగం ధ్వంసమైంది. అయితే విమానంలోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 162 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం కారణంగా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు.
811944