జపాన్ లో తొలిసారిగా ఓ ప్రైవేట్ రంగ సంస్థ రాకెట్ ను తయారు చేసింది. తొలి ప్రైవేట్ కంపెనీ రాకెట్ ప్రయోగించిన కొద్దిసేపటికే పేలిపోయింది. ఓ ప్రైవేట్ కంపెనీ రాకెట్‌ను తయారు చేసి అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అయితే ప్రయోగించిన కొద్దిసేపటికే అది పేలిపోయింది. ఆన్లైన్ వీడియోలో ‘కైరోస్’ అనే రాకెట్ సెంట్రల్ జపాన్‌లోని వాకయామా ప్రిఫెక్చర్ ఆఫ్‌షోర్ ప్రాంతం నుండి ప్రయోగించిందని.. అయితే అది టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలో పేలిపోయిందని చూపిస్తుంది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో పాటు కొన్ని చోట్ల మంటలు ఎగసిపడ్డాయి.
మంటలను ఆర్పే ప్రయత్నంలో ఆ ప్రదేశంలో నీళ్లను చిమ్ముతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ రాకెట్ జపాన్ రాజధాని టోక్యోకు చెందిన ‘స్పేస్ వన్’ అనే స్టార్టప్‌కు చెందినది. జపాన్ మీడియా నివేదికల ప్రకారం, ప్రయోగం ఇప్పటికే చాలాసార్లు ఆలస్యం అయిందని..డేంజర్ జోన్లో కనిపించడంతో చివరిసారిగా శనివారం వాయిదా పడింది. ఇది విజయవంతమైతే, అంతరిక్ష కక్ష్యలోకి రాకెట్‌ను పంపిన మొదటి ప్రైవేట్ సంస్థ ‘స్పేస్ వన్’ రికార్డు నమోదు చేస్తుండేది.
Ouch the first Kairos rocket in Japan just, exploded after about 5 seconds. 😬
The launch site at first glance seems ok… I think. pic.twitter.com/mddZrPgJ1e— Marcus House (@MarcusHouse) March 13, 2024
గతంలో అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ చంద్రుడిపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన వ్యోమనౌక చంద్రుడిపై దిగడం ఇదే తొలిసారి. అయితే, ఈ వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై దిగిన తర్వాత బోల్తా పడింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికా అంతరిక్ష నౌక చంద్రుడిపైకి దిగింది. అది కూడా ఓడిసియస్ ల్యాండర్ అనే ప్రైవేట్ కంపెనీకి చెందిన చంద్రయాన్. ఇది చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయినప్పుడు, కొన్ని లోపం కారణంగా బృందం అంతరిక్ష నౌకతో సంబంధాన్ని కోల్పోయింది. ల్యాండింగ్ సమయంలో, మూన్ ల్యాండర్ ఒడిస్సియస్ ఒక కాలు చంద్రునిపై ఇరుక్కుపోయిందని నాసా తెలిపింది. ఒక వారం తరువాత, చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న ఒడిస్సియస్ పని చేయడం మానేసింది.
ఇది కూడా చదవండి: నథింగ్ ఫోన్ (2a) Vs వన్ ప్లస్ నార్డ్ CE 3 5G:ఏ ఫోన్‌ని కొనడం బెస్ట్.!
