ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగ్గజం “ఫిలిప్స్” భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. 4,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు ఫిలిప్స్ ఈరోజు (సోమవారం) ప్రకటించింది.
మూడవ త్రైమాసికంలో ఫిలిప్స్ వ్యాపారంపై నిర్వహణ మరియు సరఫరా గొలుసు సవాళ్లు ప్రభావం చూపాయని ఫిలిప్స్ CEO రాయ్ జాకబ్స్ తెలిపారు. ఈ క్రమంలోనే ఉద్యోగులను తొలగించే నిర్ణయాలను తీసుకోవాలి. ఫిలిప్స్‌ను మళ్లీ ప్రపంచ అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇది తొలి అడుగు అని ఆయన అన్నారు. అయితే, లేఆఫ్‌ల వల్ల నష్టపోయిన ఉద్యోగుల విధిని తేలికగా తీసుకోవడం లేదని, వారికి ఉపశమనం కలిగించే విధానాలను అమలు చేస్తామని రాయ్ జాకబ్స్ చెప్పారు.