Glenn Maxwell: మ్యాక్స్‌వెల్ ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. అయితే దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా రిపోర్టు తయారు చేసింది. ఓ మ్యూజిక్ షో వెళ్లిన మ్యాక్సీ అక్కడ ఫుల్‌గా తాగినట్లు తెలిసింది. దాంతో అతను స్పృహ కోల్పోయాడు.
అడిలైడ్: ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell).. రెండు రోజుల క్రితం ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆ ఆల్‌రౌండర్‌కు ఏమైందన్న దానిపై ఓ నివేదికను రూపొందించారు. లైట్ నైట్ పార్టీలో ఫుల్‌గా తాగిన మ్యాక్స్‌వెల్.. స్పృహ కోల్పోయినట్లు ఓ మీడియా కథనంలో వెల్లడించారు. తాగిన మైకంలో స్పృహ లేకుండా ఉన్న మ్యాక్స్‌వెల్‌ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నించారు. అంబులెన్స్‌లో తీసుకువెళ్తుండగా అతను మళ్లీ స్పృహలోకి వచ్చినట్లు ఆ రిపోర్టులో తెలిపారు.
సిక్స్ అండ్ ఔట్ బ్యాండ్ నిర్వహిస్తున్న కన్సర్ట్‌ను చూస్తున్న సమయంలో మ్యాక్స్‌వెల్ ఫుల్‌గా తాగేశాడు. ఆ మ్యూజిక్ షో సమయంలో అతనితో అనేక మంది ఫోటోలు కూడా దిగారు. కానీ కొందరు మిత్రులతో కలిసి అతను ఫుల్‌గా మందు కొట్టేశాడు. అదుపు లేకుండా తాగేశాడు. ఆ సమయంలో స్పృహ కోల్పోయిన మ్యాక్స్‌వెల్ ఎంత పిలిచినా లేవలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ప్రస్తుతం మ్యాక్స్‌వెల్ డిశ్చార్జ్ అయ్యాడు. ట్రైనింగ్ కూడా అతను స్టార్ట్ చేశాడు.
ఆ మ్యూజిక్ షోలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఉన్నా.. అతను మాత్రం హద్దులు దాటలేదు. త్వరలో జరిగే టీ20 సిరీస్‌కు మళ్లీ మ్యాక్స్‌వెల్ జట్టులోకి రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. గత ఏడాది మ్యాక్స్‌వెల్‌కు పలు సందర్భాల్లో గాయాలు అయ్యాయి. అయినా అతను వరల్డ్‌కప్‌లో రాణించాడు. అహ్మదాబాద్ మ్యాచ్‌లో అతను కాంకషన్‌కు గురైన విషయం కూడా తెలిసిందే. 2022లో ఓ ఫ్రెండ్ పార్టీకి వెళ్లి వస్తున్న సమయంలో కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడతను. దీంతో అతను మూడు నెలల క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.
