Hanuman | ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్ సినిమా సంచలన హిట్ అందుకుంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమాతో పోటీ పడి మరీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ సినిమాను థియేటర్‌లో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.
Hanuman | ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్ సినిమా సంచలన హిట్ అందుకుంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమాతో పోటీ పడి మరీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ సినిమాను థియేటర్‌లో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ఓటీటీలోకి వచ్చేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా ఓటీటీలోకి మాత్రం రాలేదు. దీంతో డిసప్పాయింట్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు షాకింగ్ అప్‌డేట్ వచ్చింది. హనుమాన్ మూవీ ఓటీటీలో కంటే కూడా ముందుగా టీవీలో టెలికాస్ట్ కానుంది.
కలర్స్ సినిప్లెక్స్ హనుమాన్ సినిమా మార్చి 16వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. కేవలం హిందీలో మాత్రమే ఈ సినిమా టెలికాస్ట్ అవుతుంది. అదే సమయంలో జియో సినిమాలోనూ హిందీ వర్షన్ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన వివరాలను కలర్స్ సినీ ప్లెక్స్ సంస్థ ట్విట్టర్ (ఎక్స్)లో వెల్లడించింది. ఇదే విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ట్వీట్ కూడా చేశాడు.
Brahmaand ka sabse pehla SUPERHERO ab aayega aapke TV screens par! 🔥📺
16 March raat 8 baje, dekhiye #HanuMan ka World Television Premiere, Hindi mein pehli baar, Colors Cineplex aur JioCinema par.@tejasajja123 @Actor_Amritha @Primeshowtweets @RKDStudios @Colors_Cineplex… pic.twitter.com/0Uq7qg6Efh
— Prasanth Varma (@PrasanthVarma) March 8, 2024
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజా సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది. 40 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 330 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమాకు థియేటర్స్‌లో వచ్చిన రెస్పాన్స్ చూసి 50 రోజుల తర్వాతే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ భావించారు. ఈ క్రమంలోనే మార్చి 2వ తేదీన హనుమాన్ సినిమా ఓటీటీలోకి వస్తుందని అనుకున్నారు. కానీ మహాశివరాత్రి దగ్గరలోనే ఉండటంతో మార్చి 8న హనుమాన్ ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న జీ5 సంస్థ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో అసహనానికి లోనైన ఫ్యాన్స్.. హనుమాన్ సినిమాను ఓటీటీలోకి ఎప్పుడు తీసుకొస్తారని జీ5 సంస్థను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రశ్నించగా.. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇలాంటి తరుణంలో ఓటీటీ కంటే ముందే టీవీలో టెలికాస్ట్ అవుతుండటంతో ఫ్యాన్స్ షాకైపోతున్నారు.
