
లండన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కారు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రికి చేరుకున్నాడు. బీబీసీ కోసం టీవీ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. వెంటనే అతడిని హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించినట్లు బీబీసీ యాజమాన్యం తెలిపింది. అయితే తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని ఫ్లింటాఫ్ తెలిపారు.
షూటింగ్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని బీబీసీ పేర్కొంది. మూడేళ్ల క్రితం ఫ్లింటాఫ్ చిత్రీకరణ సమయంలో కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
