ఒడిశా (Odisha)లోని బజ్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్‌పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు.
భువనేశ్వర్: ఒడిశా (Odisha)లోని బజ్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్‌పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు. మరో 38 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీకి తరలించారు.
కటక్ నుంచి బెంగాల్‌లోని దిఘాకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. బస్సులో 50 మంది ఉన్నారని తెలిపారు. మద్యం మత్తులో బస్సును నడపడంతోనే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.