
మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ వేలికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో మూడో వన్డే నుంచి అతడిని తప్పించారు. డిసెంబర్ 14న బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ శుక్రవారం ఈ ప్రకటన చేసింది. గాయపడిన రోహిత్‌కు బీసీసీఐ వైద్య బృందం పరీక్షలు చేస్తోందని, నిపుణుల సంప్రదింపుల కోసం అతడు ముంబై వెళ్లాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్‌తో జరిగే మూడో వన్డేకు కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది.
875894
