
ఢాకా: బంగ్లాదేశ్‌ను సిట్రాన్ తుపాను అతలాకుతలం చేసింది. బంగ్లాదేశ్ తీరంలో బంగ్లాదేశ్‌లోని బైరిసాల్‌లో దిగింది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి 35 మంది చనిపోయారు. దాదాపు 10,000 ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. 15 తీర ప్రాంతాల్లో సుమారు 8 మిలియన్ల మంది ప్రజలు అంధకారంలో ఉన్నారని, తుఫాను విద్యుత్తు అంతరాయం కారణంగా 15 ఎకరాల పంటలు నాశనమయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. వేల సంఖ్యలో చేపలు పట్టే వస్తువులు కొట్టుకుపోయాయని పేర్కొంది. వరదల కారణంగా రోడ్లు తెగిపోవడంతో విమానాలు నిలిచిపోయాయని, రవాణా వ్యవస్థలు స్తంభించాయని పేర్కొంది.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 219,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 6,925 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయని వెల్లడించారు. మరోవైపు తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
813334