హైదరాబాద్ బంగారహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని రెయిన్‌బో ఆస్పత్రి వద్ద ఆగి ఉన్న డీసీఎం వాహనంపైకి కారు ఢీకొట్టింది.

హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని రెయిన్‌బో ఆస్పత్రి వద్ద ఆగి ఉన్న డీసీఎం వాహనంపైకి కారు ఢీకొట్టింది. దీంతో సెక్యూరిటీ గార్డుతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదానికి గురై ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
