సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో దాదాపు 300 ఏళ్ల నాటి మెట్టబావిని ఈ నెల 5న మంత్రి కేటీఆర్ తిరిగి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ నిజాం కాలంలో నిర్మించిన బావులు చెత్తకుప్పలుగా మారాయన్నారు.
మంత్రి తలసాని మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మెట్ట బావులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయన్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా చుట్టుపక్కల వాతావరణాన్ని అభివృద్ధి చేశారు. రాబోయే కొద్ది రోజులకు ఇది గొప్ప పర్యాటక ప్రాంతం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
