బస్సు నడుపుతుండగానే డ్రైవర్ గుండెపోటుతో స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. దేవరకొండ బస్ డిపోకు చెందిన బస్సు నల్లగొండ జిల్లా మల్లేపల్లి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బంగళూరు దగ్గర జరిగిన ఘటనలో.. అనారోగ్యం పాలైన డ్రైవర్ శంకర్ నాయక్‌ను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఛాతీలో నొప్పి వస్తుందని గమనించిన డ్రైవర్.. బస్సును రోడ్డు పక్కనే ఆపేశాడు. ఆ తర్వాత స్టీరింగ్‌పై కుప్పకూలాడు. శ్వాస తీసుకోవడంలో డ్రైవర్‌కు ఇబ్బంది తలెత్తింది. దీంతో ప్రయాణికులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి.. ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ
