మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి ఇవాళ(శుక్రవారం) దిగువ గోదావరిలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ డీఈ గణేష్ తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ ఏడు కూడా తాగునీటి అవసరాల కోసం బాబ్లీ దిగువనున్న ఎస్సారెస్పీలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. అదేవిధంగా జులై ఒకటవ తేదీన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు అక్టోబర్ 28 తేదీ వరకు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు.
బాబ్లీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 2.75 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 0.75 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. ఆందులో నుంచి దిగువకు 0.6 టీఎంసీలను విడుదల చేశారన్నారు. 0.6 టీఎంసీల నీరు దిగువ గోదావరిలోకి విడుదల కాగానే బాబ్లీ గేట్ల మూసివేత ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.
ఇది కూడా చదవండి:మధురానగర్‌లో కారు బీభత్సం.. స్కూల్ పిల్లలకు గాయాలు
