Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

బిర్యానీ షాదీమే అబ్దుల్లా దీవానా!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 26, 2024No Comments

ఒకోళ్లను జూశి ఇంకోళ్లు పోటీలు వడ్డట్టు రకరకాల ఐటమ్లతోని శుభకార్యాలను ఐటెం సాంగ్స్‌ ఈవెంట్స్‌ లెక్క జేసి పారేస్తున్నరు. వెయ్యి అవద్దాలు ఆడి సంబంధాలు ఎట్ల కాయం జేసుకుంటున్నరో ఆ లెక్కనే వంద అప్పులైనా జేసి పెండ్లి, వలీమాలు మా ఘనంగా జేసుకుంటున్నరు.

January 27, 2024 / 01:25 AM IST
బిర్యానీ షాదీమే అబ్దుల్లా దీవానా!

చికెన్‌ బిర్యానీ, చికెన్‌ ఫ్రై, హరా చికెన్‌, చీజ్‌, లాల్‌ చికెన్‌, లెగ్‌ పీసెస్‌, శీక్‌ చికెన్‌, ఫిష్‌ ఫ్రై, పాయా, రుమాలీ రోటీ, మటన్‌ కా కుర్మా, పరోటా, హరీస్‌, దహీ, మిర్చీ కుర్మా, క్యారట్‌ హల్వా, షాహీకే టుక్డే, ఖుర్బానీ కా మీఠా, ఫ్రూట్‌ కా మీఠా, కద్దూకి ఖీర్‌, పాన్‌, కూల్‌ డ్రింక్‌, ఐస్‌ క్రీం.

అబ్బబ్బా ఒకటా, రెండా.. ఇప్పుడు లేటెస్ట్‌ షాదీ, వలీమాలల్ల కనిపిస్తున్న ఐటమ్స్‌? సూశినోనికే ‘అబ్బా..’ అనిపించేటంతటి ఐటమ్స్‌! అన్నీ ఐటమ్స్‌ నూనెల ఇట్ల డైవ్‌ గొడ్తుంటయి. బావర్చీ ఖానా నిండా అండలే అండలు. ఏది తినాల్నో అర్థం గాదు. డైలమా! కన్ఫ్యూజన్‌! గిది టేస్ట్‌ సూద్దామా? గది టేస్ట్‌ సూద్దామా? అనుకొని అదొకటి, ఇదొకటి కడుపుల వడేస్తుంటే ఆయింత కడుపు నిండిపోతది. ఏదీ కుతారా తిన్నంత ఫీలింగ్‌ ఉండది. తిండి కాడ ఎసుంటి ఆంక్షలు పెట్టొద్దు.. ఎవరిష్టం వచ్చింది ఆల్లు తింటరు. అయితే ఆ తినే తిండి మన ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది అనేది గూడ లెక్కలకు వస్తది కదా!

ఒకోళ్లను జూశి ఇంకోళ్లు పోటీలు వడ్డట్టు రకరకాల ఐటమ్లతోని శుభకార్యాలను ఐటెం సాంగ్స్‌ ఈవెంట్స్‌ లెక్క జేసి పారేస్తున్నరు. వెయ్యి అవద్దాలు ఆడి సంబంధాలు ఎట్ల కాయం జేసుకుంటున్నరో ఆ లెక్కనే వంద అప్పులైనా జేసి పెండ్లి, వలీమాలు మా ఘనంగా జేసుకుంటున్నరు. కంటికి ఇంపుగ కనిపిచ్చే లెక్కలేనన్ని ఐటమ్స్‌. ఒక్క నాల్కెకు లెక్కకు మించిన రుచులు. తిని నెమరు వెడదామన్నట్టు మనకు లేకపాయె.. అయినా ఎగవడి ఎగవడి ఈర్‌మార్‌ తింటుంటం. తిన్నంక బదజ్మీ అని ఈనో తాగుడొకటి ఉంటది. శిన్న తిప్పలా.. లగ్గం వోయిన గాడిది ఇంత సుఖం యాడిది అన్నట్టు?

గరీబోని బిడ్డె పెండ్లీల గూడ ఇన్నిగనం ఐటమ్స్‌ చెయ్యమని ఫర్మాయిష్‌లు వస్తున్నయి. తిండికే ఎటమటం పది లక్షల దాంక కర్సు అయితున్నది. ఇగ షాదీఖానా కిరాయ వేరు, ఇంకా ఇతర కర్సులు వేరు. ఎటు లేదన్నా 20 లక్షల దాంక కర్సులు జేస్తే గానీ, ఆడిబిడ్డె లేవని కాడికి వచ్చింది పరిస్థితి!

అంతగనం పైసలు కర్సువెట్టి గరీబోడు బిడ్డెను లేపియ్యాలంటే శెరవోవాల్సిందేనా? పాపం పేదోడు తిండికే అలమటిస్తుండంటే.. అన్నేసి పైసలు వెట్టి బిడ్డె లగ్గం జేస్తడా? ఆ తిండి కర్సులు తప్పిస్తే శాన పైసలు మిగులువాటు అయితయి. ఏమన్నంటే తిండి కాడనే పేరెల్తది అంటరు గనీ, దాని ఎనకాల గరీబోడు ఎంత నలిగిపోతడో ఒక్క క్షణం ఆలోచించరు? కొందరు వరకట్నం తీసుకోకుండా పిల్లను చేసుకుంటున్నరు. మరికొందరు ఎదురుకట్నం ఇచ్చి మరీ పెండ్లి చేసుకుంటున్నరు. కనీ తిండి కాడ మాత్రం అస్సలు ఫరక్‌ రానిస్తలేరు.

ఇంకొందరైతే పోష్‌ కల్చర్‌కు కట్టు బానిసలు అయినట్టు జరజరంత తినుకుంట అటు పారేస్తుంటరు. టేబుల్‌ మీద సగం సగం సుతారంగ తిని పారేస్తున్న ఆ అన్నాన్ని జూశి శిన్న కలకలగాదు. అయ్యో లగ్గాలల్ల ఎంత ఫుడ్డు వేస్టు జేస్తున్నరో గదా? ఎన్కటికి మంచి ఉప్పూకారం తిన్నోళ్లకు గా వంటలు అస్సలు రుచించయి. కడుపులనేమో ఆకలి. ఏదో ఒకటి లోపల పారేసి నింపుకొని ఆకలి మంట మీద సప్పున లీల్లు గుమ్మరిచ్చుకునాలె అనకుంటరు. రుచి అందుతదేమోనని దన్కాంచి మడ్కవెడ్తుంటరు కొందరు బేగానేకి షాదీమే అబ్దుల్లా దివానా అసుంటోళ్లు. ఒక్కదాంట్ల గూడ నో ఉప్పూ, నో కారం! అంతా సప్పసప్పగ! ఏదో షుగర్‌ పేషెంట్లు తినే తిండి లెక్క?

ఇది అప్పులపాలైన పిల్లోల్ల తంతు అయితే.. పిలగానోళ్లు ఇంకో రెండాకులు ఎక్వ సదివినట్టు కట్నం పైసలను ఆయింత అటే ముట్టజెప్పినట్టు ఐటమ్లతోని షాదీఖానాల ధూం మచాయిస్తరు. నో కాంప్రమైజ్‌.. వీళ్లకన్నా ఇంకో రెండు మూడు ఐటమ్స్‌ ఎక్కువే ఉండేటట్టు సూసుకుంటరాయె. మీదికెల్లి పుదీనా హార్లు, బ్యాండ్‌మేళాల నాగిని డ్యాన్సులు అబ్బబ్బా.. శెప్పతరం గాని తంతులు? ఏందో ఈ ఆర్భాటపు పెండ్లీలు? ఉన్నోనికి ఉట్ల పండుగ.. లేనోనికి అప్పుల పండుగ అన్నట్టే ఉంటున్నయి. సాదాసీదా అనే పదం అన్నిట్ల ఐప్లె అయితది గనీ, లగ్గాలు, రిసెప్షన్లకు మాత్రం అస్సలు ఐప్లె గాదు! ఎందుకంటే అక్కడనే గదా మనిషి తన షాన్‌తనం ప్రదర్శిచ్చేది?

చిన్నప్పుడు పెండ్లీలకు పోతే ఉంటుండే మజా.. ఇంటికచ్చినంక గూడ ఇంకా చేతి వేళ్లను నోట్లేసుకొని కంకుతుంటిరి? ఇప్పుడట్ల ఎవరన్న జేస్తున్నరా? మస్తు గుంజినంరా నాయినా.. మంచి బువ్వ వెట్టిండు. వాని కడుపు సల్లగుండ. తుర్కోళ్లు మస్తు మజాగ వండుతరు అని ఎవలన్న యాజ్జేస్తున్నరా? ఇప్పటి ఫంక్షన్‌ తిండ్లకు తుర్కోళ్ల పేరు వెట్టే సాహసం జేస్తరా? ఎటు వోయినయి ఆ పాత లగ్గం తిండ్లు?

బగారన్నం, మటన్‌ కూర, దాల్చ, డబల్‌ కా మీఠా.. వహ్‌ ఏం రుచి అది. నైంటీస్‌ వరకు లగ్గాలల్ల గా బగారన్నం, దాల్చలే రాజ్యాలు ఏలినయి. రెండు మూడు అండలు దిగుతుండే. దాల్చల ఆనెక్కాయలు, మటన్‌ బోటీ ఉంటది. ఎర్రటి దస్తర్‌ ఖాన్‌ మీద తెల్లటి గిన్నెలు వెట్టి దాని మీద ముష్కాబ్‌లల్ల బగారన్నం, కూర గిన్నెలల్ల దాల్చ, మటన్‌ కూర, డబల్‌ కా మీఠా లేదా మీఠా ఖానా వెడ్తుండే. ఇప్పటి లెక్క ఎడ్లోలె లిలవడో, కాలు మీద కాలు ఏసుకొని కూసుండో తినకుంట, నేల మీద సక్లంముక్లం కూసుండి తింటుండ్రి గదా. అట్ల గా బగారన్నాన్ని గిన్నెల వెట్టుకొని అన్లకు మటన్‌ కూర, దాల్చ ఏసుకొని బుక్కలు తింటుంటే నా సామిరంగా ఉంటది మజా. గా మజా ఎటువోయిందోనని గిప్పుడు దుర్బిన్‌ వెట్టి లెంకునే రోజులు అచ్చి కాలవడ్డయి కదా?

ఘుమఘుమలాడే ఆ వాసన ఎంత కమ్మగ అనిపిస్తది. ‘కడుపులు కడుక్కున్నం’ అని అంటరు గదా అట్ల ఇప్పుడెవలన్న గీ పోష్‌ ఫంక్షన్లల్ల మెక్కుతున్నరా? డౌటే? కడుపు నిండ తిని బ్రేవ్‌ మని త్రేన్చే తిండి కాదు గదా ఇది. తిన్నంక కడుపుల లొడలొడ అని దేవకపోతే అదే పదివేలు. బగ్గ దిష్టి తలిగిన బేకొట్ల లెక్క వస్తే మాత్రం.. ఆ పెండ్లికి ఎందుకెళ్లిన్రా నాయినా.. అనే ఇరిటేటింగ్‌ ఫీలింగ్‌ కలగకమానదు. గ్యార్మీ పండుగప్పుడు మాత్రమే కొందరు గా బగారా, దాల్చ చేస్తున్న దాఖలాలు కానస్తున్నయి. అవిటిలల్ల గూడ బిర్యానీ చేసి మస్తుగ అప్‌డేట్‌ అయితున్నరు నయా జమానా మనుషులు!

చేయి కడుక్కొని ఆ పోష్‌ కల్చర్‌ను అలవాటు చేసుకుందాం అని బీరాలుపోతున్న వాళ్ల నడుమ నుంచి అవుతలవడ్డడు బీరిపోయిన అబ్దుల్లా. ఫంక్షన్‌హాలు బయట కొంతమంది ముష్టోళ్లున్నరు. ఇప్పుడేం లేదు ఫంక్షన్‌ అంతా అయిపోయినంక రండ్రి అని పెండ్లికి అచ్చిన ఒగ సుట్టపాయిన వాళ్లను ఈగలను అదిలిచ్చినట్టు అదిలిచ్చుకుంట గదిరిస్తున్నడు. వాళ్లను సూడంగనే అబ్దుల్లాకు పాపం అనిపిచ్చింది. మనసు మెరమెర అన్నది. పెండ్లికి వచ్చినోళ్లల్ల వీళ్లంత ఆకలైతే ఎవరికీ అయితలేదు. ఆకలికి అసలుసిసలైన రూపాలు వీళ్లు. ఆకలైనోనికే గదా ముందుగాల్ల పట్టెడు బువ్వ పెట్టాలె. గీ పెండ్లికచ్చినోళ్లల్ల ఏ ఒక్కరు గూడ తృప్తిగ త్రేన్చినట్టు అనిపియ్యలేదు. ఆకలైనోడి కడుపు నిండినప్పుడు ఉండే తృప్తి గదా ఆ లగ్గానికి వన్నె తెచ్చేది, అల్లా ఖుష్‌ అయ్యేది.

గప్పుడే అబ్దుల్లా ఒక నిర్ణయానికచ్చిండు. నా లగ్గం గిన అయితే ఇంట్ల కొట్లాడి మరీ బగారన్నం, దాల్చ జేపిచ్చి ముందుగాల్ల ఇట్ల ఆకలైనోళ్లకే బువ్వ వెడ్త హా.. అని గట్టిగ నిర్ణయించుకున్నడు.

‘గా బగారన్నం, దాల్చ గిప్పుడెవలు జేస్తున్నరు? చికెన్‌ బిర్యానీ రోజుల్ల ఉన్నం మనం అప్‌డేట్‌ గావాలె. పాత పురాణం లెక్క గా బగారన్నం, దాల్చ పిచ్చి వట్టుకుంది ఏందిరా నీకు’ అని అంటే మాత్రం నాకు లగ్గమద్దు ఏమద్దు అని లైఫ్‌ లాంగ్‌ లగ్గమే జేసుకోకుంట ఒంటిగుండిపోత అని మనసుల గట్టిగ అనుకున్న అబ్దుల్లా ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అనే రివాజును షురు జెయ్యాలనుకుంట ఇంటికి వోయిండు. టేబుల్‌ మీద వెయిటర్లు దన్కాంచి ఐటెమ్ల ఎన్క ఐటెమ్లు పెడుతున్నరు. అవిటిని జూశి అబ్దుల్లాకు మొకం తింపింది. కడుపుల కసబిస అన్నది. ఇకారం అస్తున్నది. అట్లనే నిలువు నిస్తారం లేశిండు. అక్కడ ఏం తినకుంటనే ఒసోస అనుకుంట ఇంటికచ్చిండు. గిన్నెల తెల్ల బువ్వ వెట్టుకొని కారం, నూనె, ఇంత అల్లమెల్లిగడ్డను కలుపుకొని నోటికి కారం తగిలెటట్టు తిని తృప్తిగ బేకోట్‌ తీశిండు.

-హుమాయున్‌ సంఘీర్‌

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.