దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌ది.. అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం అవుతుందని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు, నాయకులు, పార్టీ శ్రేణులతో ఇవాళ(శుక్రవారం) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ..ఢిల్లీ పార్టీలను వదిలి.. తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులు ఎవరికి భయపడరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 100 రోజులైనా ప్రజలకు ఇచ్చిన హామీలలో నేరవేర్చించింది శూన్యమన్నారు. బొడుప్పల్ లో కాంగ్రెస్ నేతలు వక్ఫ్ భూముల సమస్యకు పరిష్కారం చూపాలి. దళితులు నివసిస్తున్న ప్రాంతాల్లో భూములకు పట్టాలు ఇప్పించాలి. కేసిఆర్, కేటీఆర్ లతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలను కోరారు.
మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎంపీగా స్థానికుడైన తనను గెలిపించాల్సిందిగా కోరారు బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులను గెలిపిస్తే అభివృద్ధి శూన్యమన్నారు. కులాలు, మతాల పేరుతో బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే పేదల ఇళ్లను కూల్చేస్తోందన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉన్న తనను గెలిపించాల్సిందిగా ప్రజలకు కోరారు రాగిడి లక్ష్మారెడ్డి.
ఇది కూడా చదవండి: మద్యం కేసులో కవిత నిందితురాలు కాదు.. బాధితురాలు
The post బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులు.. ఎవరికి భయపడరు appeared first on tnewstelugu.com.
