
- భోజ్‌పురి స్టార్ సింగర్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పవన్‌సింగ్.. ప్రముఖ భోజ్‌పురి గాయకుడు, నటుడు. బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని ఆయనకు బీజేపీ టికెట్ కేటాయించగా, దాన్ని తిరస్కరించి పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా అదే పవన్‌సింగ్ బీహార్‌లోని కర్కత్ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు బుధవారం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
‘మాతా గురుతర భూమేరు’ అంటే తల్లి ఈ భూమి కంటే గొప్పదని, తాను ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తానని తన అమ్మకు హామీ ఇచ్చానని పవన్‌సింగ్ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. బీహార్‌లోని కర్కత్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇక్కడ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో భాగమైన సీపీఐ(ఎల్ఎల్) లిబరేషన్‌కు చెందిన రాజారామ్ సింగ్‌తో పవన్ సింగ్ తలపడనున్నారు.