
- కోల్‌కతాకు వచ్చిన ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టుకు “ప్రయాణ మిత్ర” అవార్డు లభించింది. అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక నిర్వహణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం కోల్‌కతాలో జరిగిన సదస్సులో బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక నిర్వహణ కమిటీ ఛైర్మన్, సెక్రటరీ జనరల్ కౌలేస్‌కుమార్ రబింజపాన్ మాట్లాడుతూ ఆసియా దేశాల్లోనే బుద్ధ వనం విశిష్టమైందని, బౌద్ధ టూరిజం అభివృద్ధికి, పరిరక్షణకు అందులోని బౌద్ధ కళ ఎంతో అవసరమన్నారు. బౌద్ధ సంస్కృతి, మరియు శాంతి ప్రచారం.
