బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్లపై చిరుత రెచ్చిపోయింది. బెంగళూరు జిల్లా వెలుపల చిరుతపులులు సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో భారీ బోనులను ఏర్పాటు చేశారు. అయితే చిరుతపులులు జింకలను వేటాడిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి తురహళ్లి అటవీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
ఈ సందర్భంగా బెంగళూరు డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్‌ఎస్ రవిశంకర్ మాట్లాడారు. బన్నెరగట్ట జాతీయ ఉద్యానవనానికి సమీపంలో ఉన్న అటవీప్రాంతం కారణంగా చిరుతలు సంచరిస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఒకే ఒక్క చిరుతపులి ఉంది. నాలుగు చిరుతలు సంచరిస్తున్నాయంటూ వస్తున్న వైరల్ వార్తలు అవాస్తవమని కొందరు స్పష్టం చేశారు.
865688