Sangareddy | సంగారెడ్డి(Sangareddy) జిల్లా పటాన్‌చెరులో మద్యం మత్తులో విద్యుత్ టవర్(Electricity tower) ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్(Man creates ruckus) చేశాడు.

హైదరాబాద్ : సంగారెడ్డి(Sangareddy) జిల్లా పటాన్‌చెరులో మద్యం మత్తులో విద్యుత్ టవర్(Electricity tower) ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్(Man creates ruckus) చేశాడు. వివరాల్లోకి వెళ్తే..బండ్లగూడకు చెందిన ఖదీర్ బైకు చోరీకి గురైందని గురువారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌లో కిటికీకి తలబాదుకున్నాడు. పోలీసులు అతడిని సముదాయించి దవాఖానకు తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో కిందకు దిగాడు.