Byjus | ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎడ్ టెక్ సంస్థ బైజూస్ యాజమాన్యానికి మరో షాక్ తగిలింది. బైజూస్ భారత్ సీఈఓ అర్జున్ మోహన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.

Byjus | ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎడ్ టెక్ సంస్థ బైజూస్ యాజమాన్యానికి మరో షాక్ తగిలింది. బైజూస్ భారత్ సీఈఓ అర్జున్ మోహన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. బైజూస్ సంస్థను పునర్వ్యస్థీకరిస్తున్న వేళ అర్జున్ మోహన్.. సీఈఓగా రాజీనామా చేయడం ఆసక్తికర పరిణామం. దీంతో సంస్థ రోజువారీ వ్యవహారాలను బైజూస్ ఫౌండర్ బైజూ రవీంద్రన్ స్వయంగా పర్యవేక్షిస్తారని బైజూస్ వెల్లడించింది. గతంలో బైజూ రవీంద్రన్ క్యాట్ కోచింగ్ ఇస్తున్నప్పుడు ఆయన విద్యార్థిగా ఉన్న అర్జున్ మోహన్.. బైజూస్ ఇండియా సీఈఓగా ఆరు నెలల క్రితమే బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సంస్థ సీఈఓగా రాజీనామా చేసినా, బైజూస్ సలహాదారుగా ఆయన కొనసాగుతారిన తెలుస్తున్నది. బైజూ రవీంద్రన్‌కు అర్జున్ మోహన్ అత్యంత నమ్మకస్తుడని కంపెనీ వర్గాలు తెలిపాయి.
బైజూస్ ఇండియా సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే సంస్థలో అర్జున్ మోహన్ కీలక మార్పులు చేపట్టారు. భారీగా ఉద్యోగులను తొలగించడంతోపాటు మిగతా వారికి ‘వర్క్ ఫ్రం హోం’ చాన్స్ కల్పించారు. దేశవ్యాప్తంగా అన్ని ఆఫీసులు మూసేశారు. తొలుత బైజూస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పని చేశారు. తర్వాత రెండేండ్లు అప్ గ్రాడ్ ఇండియా సీఈఓగా పని చేసినా, గత సెప్టెంబర్ లో తిరిగి బైజూస్‌కు చేరుకున్నారు.