రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయి వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల ముప్పు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ సూచించింది. ఆయా జిల్లాలకు అధికారులు సోమవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా వడగాలుల హెచ్చరికలు చేశారు. సోమవారం నుంచి కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొన్నారు.
అలాగే 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే కరీంనగర్, నల్గొండ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాద్రి, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ తెలిపింది. బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు.కూల్ డ్రింక్స్ కాకుండా పండ్ల రసాలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద రాజకీయ కుట్రదారు కడియం శ్రీహరి
The post భగ్గుమంటున్న సూరీడు..15 జిల్లాలకు ఐఎండీ అలర్ట్..! appeared first on tnewstelugu.com.