అనుమానం పెనుభూతమైంది. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడు. ఈ హత్యకు పిల్లలు సాక్ష్యం చెబుతారనే అనుమానంతో వాళ్లను కూడా హతమార్చాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో జిల్లాలోని బిజ్నోర్ ఏరియాలోని శరవణ్ నగర్ ఈ దారుణ ఘటన జరిగింది. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రామ్‌లగన్ అనే 32 ఏళ్ల వ్యక్తి భార్య జ్యోతి (30), పిల్లలు పాయల్ (6), ఆనంద్ (3) తో కలిసి శరవణ్ నగర్ ఏరియాలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య తరచూ ఫోన్‌లో మాట్లాడుతుడంపై రామ్‌లగన్‌లో అనుమానం మొదలైంది. భార్య ఎంతచెప్పినా వినకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలైయ్యాయి. ఈ క్రమంలోనే మార్చి 28న రాత్రి ఇద్దరూ గొడవపడ్డారు.
గొడవ ముదరడంతో ఆమె మెడలో ఉన్న స్కార్ఫ్ తో ఉరి బిగించి చంపాడు. పిల్లల కళ్ల ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత వారి తల్లిని తానే చంపినట్లు సాక్ష్యం చెబుతారనే భయంతో ఇద్దరు పిల్లలను కూడా హత్య చేశాడు. తర్వాత రాత్రంతా ఆ ముగ్గురి మృతదేహాల పక్కనే గడిపాడు. ఉదయం ఎప్పటిలాగే విధులకు వెళ్లి సాయంత్రం తిరిగొచ్చి పడుకున్నాడు.
ఇరుగు భార్య, పిల్లల గురించి ఆరా తీయంగా హోలి పండుగకు తల్లిగారింటికి వెళ్లారని, ఇంకా రాలేదని చెప్పాడు. వరుసగా మూడు రాత్రులు అదేవిధంగా పగలు బయటికి వెళ్లడం, రాత్రికి వచ్చి మృతదేహాల పక్కనే పడుకోవడం చేశాడు. నాలుగో రోజు ఇంటి నుంచి దుర్వాసన రావడం, తలుపులు తీసి ఉండటంతో ఇంటి యజమాని లోపలికి వెళ్లిచూశాడు. లోపల తల్లిముగ్గురూ విగతజీవులుగా పడివుండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఐదేండ్లు రేవంత్ రెడ్డినే పరిపాలించి, హామీలు అమలు చేయాలి
The post భార్యాపిల్లలను హతమార్చి.. మూడు రాత్రులు శవాలతోనే.. appeared first on tnewstelugu.com.