Bhuvangiri | యాదాద్రి జిల్లాలో దారుణం చోట చేసుకుంది. రౌడీ షీటర్(Rowdy sheeter) నయీమ్ అంతమైనా అతని అనుచురుల దాడులు శృతి మించుతున్నాయి.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి జిల్లాలో దారుణం చోట చేసుకుంది. రౌడీ షీటర్(Rowdy sheeter) నయీమ్ అంతమైనా అతని అనుచురుల దాడులు శృతి మించుతున్నాయి. తాజాగా నయూమ్ అనుచరుడు, రౌడీ షటర్ వీరంగం సృష్టించారు. భువనగిరిలో(Bhuvangiri) సాయితేజ డియాగ్నస్టిక్ యజమాని శిగ నరేష్ పై హత్యా యత్నానికి ప్రయత్నించాడు.
అందరూ చూస్తుండంగానే పట్టగపగలు రౌడీ షీటర్ బాబా నరేష్‌పై కత్తితో దాడి చేశాడు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ఘనటతో స్థానికులు భయంతో పరుగుల తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
