
మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య(87) మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి ఈరోజు (బుధవారం) కరీంనగర్ లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. మరణవార్త విన్న సీఎం కేసీఆర్ మంత్రి గంగుల ఫోన్ చేసి పరామర్శించారు. దుఃఖంలో ఉన్న గంగులను ముఖ్యమంత్రి ఓదార్చారు మరియు వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గంగుల మల్లయ్యగారి ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ ప్రార్థిస్తున్నారు.
