
కలెక్టరేట్ / తిమ్మాపూర్ రూరల్, 23 డిసెంబర్: జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గూడెంకు టీజీఓ, టీఎన్‌జీఓఎస్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. టీజీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్, టీఎన్‌జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు హైదరాబాద్ నుంచి వచ్చి మానేరు వంతెన దగ్గర పూలమాలలు వేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆయా సంఘాల నాయకులను ఆలింగనం చేసుకుని పేరుపేరునా ప్రసంగించారు. కార్యక్రమంలో టీజీఓల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, టీఎన్‌జీఓఎస్ నాయకుడు ముప్పిడి కిరణ్‌కుమార్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకుడు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
