మంత్రి సబితా ఇంద్రారెడ్డి |అధికార దాహంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.

కందుకూరు (రంగా రెడ్డి): అధికార దాహంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గేటు వద్ద ఆమె బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, దేశంలో బీఆర్ ఎస్ పార్టీ మారదన్నారు. బీఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు అన్ని పార్టీలు భయపడుతున్నాయన్నారు. ప్రభుత్వ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరుతోందన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
ప్రజల మద్దతు ఉన్నంత మాత్రాన బీఆర్ ఎస్ ను ఎవరూ ఏమీ చేయలేరని వెల్లడించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి, జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెటింగ్ చైర్మన్ సురుసాని సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మండల పార్టీ చైర్మన్ మన్నె జయేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
