మణిపూర్‌లో ఆర్మీ అధికారి కిడ్నాప్ అయ్యారు. ఆయన స్వగృహం నుంచే దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. గతేడాది మేలో సరిహద్దు రాష్ట్రంలో జాతిహింస ప్రారంభమైనప్పటి నుంచి అధికారులు కిడ్నాప్‌కి గురవుతున్నారు. కిడ్నాప్‌కి గురైన ఆర్మీ ఆఫీసర్ పేరు కొన్సామ్ ఖేదా సింగ్. ఇతను తౌబల్ జిల్లాకు చెందిన జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జెసిఓ). ఖేదా సింగ్ తన ఇంట్లోనే ఉన్నప్పుడు ఇవాళ(శుక్రవారం) ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి.. అతన్ని వాహనంలో తీసుకెళ్లారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. తమకు సమాచారం అందిన వెంటనే సెక్యూరిటీ ఏజెన్సీల సమన్వయంతో సెర్చ్ ఆపరేషన్ చేశామన్నారు. 102 నేషనల్ హైవేపై ఉన్న అన్ని వాహనాల్ని తనిఖీ చేస్తున్నాము. అయినప్పటికీ ఖేదాసింగ్ కనిపించలేదు. అసలు అతన్ని ఎందుకు కిడ్నాప్ చేశారో మాకు తెలియదు. దానిపై పరిశీలిస్తున్నాము అని భద్రతా వర్గాలు చెప్పాయి.
గతేడాది మే 2023 నుండి ఇది నాల్గో సంఘటన. సెలవుల్లో ఉన్న సైనికులు, విధుల్లో ఉన్నవారు లేదా వారి బంధువులను లక్ష్యంగా చేసుకుంటున్నారని భద్రతా వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు.. గుడ్డిగుర్రం
