విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో చేపల కూరను చేర్చాలని మత్స్యశాఖ యోచిస్తోంది. మత్స్య ఫెడరేషన్ దీనిపై కసరత్తు చేస్తోంది.

- ఫిషరీ డ్రిల్
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో చేపల కూరను చేర్చాలని మత్స్యశాఖ యోచిస్తోంది. మత్స్య ఫెడరేషన్ దీనిపై కసరత్తు చేస్తోంది. పక్కాగా ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, ఎన్ని రోజులకు చేపల కూర ఇస్తారు, ఒక్కొక్కరికి ఎన్ని గ్రాములు కావాలి, పిల్లలందరికీ మొత్తం ఎంత చేపలు కావాలి, నిధులు ఎలా సమకూరుస్తారో అధికారులు లెక్కలు వేస్తున్నారు.
ఈ పని పూర్తయ్యాక పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

