
- టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి
నల్గొండ రూరల్, డిసెంబర్ 9: మాదిగ జాతి అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర చైర్మన్ వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. 28 ఏళ్లుగా న్యాయమైన వర్గీకరణ జరగాలన్న తమ డిమాండ్లను గత కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ పట్టించుకోలేదని విమర్శించారు.
మాదిగలను ఓటు బ్యాంకులుగా భావించి మోసం చేస్తున్నారు. దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు చేపడుతున్నారని కొనియాడారు.
