మహబూబ్‌నగర్‌లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని అవంతి హోటల్ వద్ద వేగంగా వస్తున్న వ్యాన్ అదుపు తప్పి సైకిల్, స్కూల్ బస్సును ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని అవంతి హోటల్ వద్ద వేగంగా వస్తున్న వ్యాన్ అదుపు తప్పి సైకిల్, స్కూల్ బస్సును ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్కూల్ బస్సు డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుడు మహబూబ్‌నగర్‌కు చెందిన సత్యనారాయణ (60 సంవత్సరాలు)గా గుర్తించారు. అయితే ఘటన సమయంలో కారులో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారని, దీంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరో ఘటనలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడాలలో ఓ మహిళను బస్సు ఢీకొట్టింది. ఆమె తక్షణమే మరణించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
