
రోమన్ క్యాథలిక్ మతపెద్దలకు చెందిన మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. ఈరోజు, శనివారం ఆయన మరణించినట్లు వాటికన్ సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. బెనెడిక్ట్ వయసు 95 ఏళ్లు. బెనెడిక్ట్ కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. గుండె సమస్యలతో పాటు ఇతర వ్యాధులకు కూడా చికిత్స చేస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించి ఈ ఉదయం 9.30 గంటలకు మృతి చెందారు.
జనవరి 2 నుంచి పోప్ పార్థివదేహాన్ని సెయింట్ పీటర్స్ బసిలికా సమీపంలో ఉంచుతామని తెలిపారు. పోప్ బెనెడిక్ట్ అంత్యక్రియల వివరాలను ప్రకటించనున్నారు.
