తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పేలడం తీవ్ర కలకలం సృష్టించింది. మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం… స్ట్రీట్ వెండర్స్ వద్ద తనీఖీల్లో సీజ్ చేసిన నాలుగు సిలిండర్లను పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు.
మాదాపూర్, జనవరి 22 : తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పేలడం తీవ్ర కలకలం సృష్టించింది. మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం… స్ట్రీట్ వెండర్స్ వద్ద తనీఖీల్లో సీజ్ చేసిన నాలుగు సిలిండర్లను పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మాదాపూర్‌లో పోలీస్‌స్టేషన్ సమీపంలో సోమవారం భక్తులు పటాకులు కాల్చారు.
ఇందులో నుంచి చిన్న నిప్పురవ్వ ఎగిరి పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఓ సిలిండర్‌పై పడి పేలింది. దీంతో మిగిలిన మూడు సిలిండర్లూ పేలాయి. పోలీస్‌స్టేషన్‌లో మంటలు చెలరేగడంతో పోలీస్ సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. హుటాహుటీన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేసుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా పోలీస్ స్టేషన్ సమీపంలో పటాకులు కాల్చిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీసీపీ వినీత్ తెలిపారు.
