మాపై కోపంతో అన్నదాతల నోట్లో మట్టికొట్టొద్దన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడిచినా పట్టించుకోక పోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు గంగుల. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆనాడు 10 ఏండ్లలో నీటిని ఇచ్చి పంటలను కాపాడారు కేసీఆర్. గ్రామాల్లో నెర్రలు బారిన నేలలు కనబడుతున్నాయి…పంటలు ఎండిపోతున్నాయి..రైతన్నలకు మేము అండగా ఉంటామన్నారు. అధికారులు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. బావులు, మోటార్ల కింద వేసుకున్న పంటలు పండగా పండిన పంట కొంటారా కొనారా.. గిట్టుబాటు ధర ఇస్తారా లేదా అనే ఆందోళన రైతుల్లో ఉందన్నారు. ఇప్పటికీ మిడ్ మానేర్ నింపి సాగుకు నీళ్ళు ఇవ్వాలి..మానేర్ డ్యాం డెడ్ స్టోరేజికి వచ్చింది..తాగునీటికి మళ్ళీ ఇబ్బందులు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు గంగుల.
10 ఏండ్లలో ఏనాడు తాగు,సాగు నీటికి ఇబ్బందులు లేకుండా చేశాం..మండుటెండల్లో మత్తడి దుంకే పరిస్థితి నుండి నీరు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గంగుల. మాపై కోపంతో అన్నదాతల నోట్లో మట్టికొట్టొద్దు..వెంటనే నీరు ఇవ్వాలని కోరారు.భారత దేశానికి అన్నం పెట్టిన తెలంగాణ.. నేడు బియ్యం గింజలు కావాలని ఇతర రాష్ట్రాల వారిని చేయి చాచే పరిస్థితి వస్తుందని భయమేస్తోంది. రుణమాఫీ, కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర, బోనస్ వంటి వాటి పై ఇప్పటికీ రైతుల్లో ఆందోళన నెలకొంది. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం కావాలని రైతులు కోరుకుంటున్నారు..కేసార్ విలువ తెలుసుకుంటున్నారు. ఆనాడు కరీంనగర్ నుండి కధనభేరి ప్రారంభించినట్లు గానే మరోసారి ఇక్కడి నుండే 12 న కేసీఆర్ సభ ఉండనుందని తెలిపారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
ఇది కూడా చదవండి: రేవంత్ ..మగతనం అంటే ఎలక్షన్లు గెలవడం కాదు
