మాస్కో కాన్సర్ట్ హాల్ పై జరిగిన దాడిని అనాగరిక ఉగ్రవాద చర్యగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, ఈ దాడిలో ఉక్రెయిన్ ప్రమేయాన్ని కూడా పుతిన్ వెల్లడించారు. దాడి తర్వాత ఉగ్రవాదులు ఉక్రెయిన్‌కు పారిపోవాలని ప్లాన్ చేశారని, అందుకు ప్రయత్నించారని అధ్యక్షుడు చెప్పారు. ఈ చర్యలో పాల్గొన్న వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పుతిన్ శనివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. దేశాన్ని ఉద్దేశించి టెలివిజన్ చేసిన ప్రసంగంలో పుతిన్ ఇలా అన్నారు: “డజన్ల కొద్దీ అమాయకులు, శాంతియుతమైన ప్రజలు బాధితులుగా మారిన రక్తపాత, అనాగరిక ఉగ్రవాద చర్యకు సంబంధించి నేను ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను. మార్చి 24న జాతీయ సంతాప దినానికి పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు.
మాస్కో సంగీత కచేరీపై దాడి చేసినవారు ఉక్రెయిన్‌కు పారిపోవడానికి ప్రయత్నించారని పుతిన్ చెప్పారు. అయితే, రష్యా ఈ వాదనను కీవ్ తోసిపుచ్చింది. పైన పేర్కొన్న కారణాలపై మాస్కో సంగీత కచేరీ దాడిలో ఉక్రెయిన్ ప్రమేయం ఉందని పుతిన్ ఆరోపించారు. ఈ దాడిలో ఇప్పటివరకు 115 మంది మరణించారు. డజన్ల మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదులు కీవ్ వైపు పారిపోయేందుకు ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ వైపు నుండి కొంతమంది రష్యా నుండి సరిహద్దు దాటడానికి సన్నాహాలు చేశారని పుతిన్ చెప్పారు.
కాగా ముష్కరులకు ఉక్రెయిన్ తో సంబంధాలున్నాయని తనకు సమాచారం అందినట్లు పుతిన్ తెలిపారు. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించేందుకు ఉక్రెయిన్ కు చెందిన కొందరు సహకరించారని రష్యా మీడియా వెల్లడించింది. అయితే ఈ వార్లను కీవ్ తీవ్రంగా ఖండించింది. తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్దానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా వెల్లడించింది. కాగా ఈ దాడికి పాల్పడింది తామే అంటూ ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: గంజి నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?