
ముప్కాల్, జనవరి 16: బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ముప్కాల్ ఎంపీపీ సామ పద్మ భర్త సామ వెంకట్ రెడ్డిపై సోమవారం ఉదయం దాడి జరిగింది. మండల కేంద్రమైన గాంధీచౌక్‌లో వెంకట్‌రెడ్డిపై గడ్డం సంతోష్, అతని తమ్ముడు గడ్డం దిలీప్, గడ్డం సంతోష్ కుమారుడు గడ్డం సాయిరెడ్డి దాడికి పాల్పడ్డారు.
అనుకున్న ప్రకారం రాళ్లతో కొట్టి తలపై తీవ్రగాయాలయ్యాయి. వెంకట్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
