Buffalo | రాష్ట్రంలో అటు సాగుకు, ఇటు తాగు నీటికి కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. సాగుకు నీరందక పంట పొలాలు ఎండిపోయాయి. మంచి నీటి సరఫరా సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Buffalo | సూర్యాపేట : రాష్ట్రంలో అటు సాగుకు, ఇటు తాగు నీటికి కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. సాగుకు నీరందక పంట పొలాలు ఎండిపోయాయి. మంచి నీటి సరఫరా సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు తాగేందుకు నీళ్లు లేక మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. ఓ కాల్వలో ఉన్న కొద్దిపాటి నీటిని తాగేందుకు దిగిన బర్రెలు.. మళ్లీ పైకి ఎక్కలేక తీవ్ర నరకం అనుభవిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు నుంచి ఎర్రగట్టుతండా వెళ్లే దారిలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాల్వలోని కొద్దిపాటి నీటిని తాగేందుకు బర్రెలు మూడురోజుల కింద కాల్వలోకి దిగాయి. కాల్వకు ఇరువైపులా లైనింగ్ చేసి ఉండడంతో పైకి వచ్చే అవకాశం లేక దిక్కు తోచక అక్కడే ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. వాటిని పైకి తెచ్చేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. వెంటనే అధికారులు స్పందించి బర్రెలను కాపాడాలని యజమానులు కోరుతున్నారు.