Medak | మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. రామాయంపేట శివారులోని ఈత వనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 2 వేల ఈత చెట్లు దగ్ధమయ్యాయి.
Medak | మెదక్ : మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. రామాయంపేట శివారులోని ఈత వనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 2 వేల ఈత చెట్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసింది. ఈ ఈత వనం గౌడ సంఘానికి చెందినది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
