మేడారం లో సమ్మక్క, సారలమ్మ మహా జాతర వైభవంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో జాతర హుండీల లెక్కింపు ఇవాళ(గురువారం) ప్రారంభమైంది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఎండోమెంట్, రెవెన్యూ, జాతర ట్రస్ట్ బోర్డు సభ్యులు, పోలీసు సమక్షంలో హుండీలు తెరుచుకున్నాయి. 518 హుండీలను 10 రోజులపాటు లెక్కించనున్నారు. లెక్కింపును అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల పహారా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు ప్రారంభమైంది. ఒడి బియ్యం, కరెన్సీ, నాణేలు, బంగారం, వెండిని వేర్వేరుగా లెక్కించనున్నారు.
ఇది కూడా చదవండి: అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు నిధులు విడుదలచేయండి
