కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుదగ్గరకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. బ్యారేజ్ దగ్గర గేట్లను మూసివేసి, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు గేట్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్ ను నేతలు పరిశీలించారు. మేడిగడ్డ పరిశీలనకు కేటీఆర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి, ప్రశాంత్ రెడ్డి, దయాకర్ రావు, నిరంజన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు వెళ్లారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ లపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ(శుక్రవారం) బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం మేడిగడ్డ పర్యటనకు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు.
ఇది కూడా చదవండి: సాంకేతిక లోపంతో గంటసేపు గాల్లోనే చక్కర్లు.. సేఫ్ గా ల్యాండ్ అయిన ఐఏఎఫ్ విమానం
