మోడీ గ్యారెంటీ అంటే ప్రతిపక్ష నేతలను జైలుకు పంపించడమేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. బీజేపీ మోడీ గ్యారెంటీ అని ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో దీనికి మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. జూన్ 4 తర్వాత అవినీతి నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని మోడీ చెప్పారని, అలా చెప్పడమంటే ప్రతిపక్ష నేతలను జైల్లో పెడతామనే అర్థం అన్నారు. ఇదే మోడీ గ్యారెంటీ అని విమర్శించారు. ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌కు వెళ్లినట్లు ఆరోపించారు.
ప్రధాని మోడీ ప్రచారంలో భాగంగా బెంగాల్‌కు వస్తున్నారని… ఇందులో తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. కానీ లోక్ సభ ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారని, ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత బీజేపీ నేతలను జైల్లో పెడతానని తాను చెబితే ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ఇది సరైనదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు మమతా బెనర్జీ.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వాళ్లకు చెప్పు దెబ్బలు తప్పవు