యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గురువారం వరకు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు స్వస్తివచనం, విష్వక్సేన పూజ, పుణ్యహవచనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

జయంత్యుత్సవాల్లో భాగంగా సాయంత్రం 6:00 గంటలకు అంకురార్పణ, రుత్విగ్వరణం, హవనం, గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈనెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు సుదర్శన నరసింహహోమం, నిత్య, శ్వత తిరు కల్యాణోత్సవాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ ఉత్సవం సందర్భంగా ప్రధాన ఆలయం ఉత్తర రాజగోప్రం వెలుపల ప్రాకార మండపంలో యాగశాల ఏర్పాటు చేశారు. 3వ తేదీ ఉదయం 9 గంటలకు నిత్యమూలమంత్ర హవనం, కాళీయ మర్థన అలంకార సేవలో స్వామివారు తిరుమాధవీధుల గుండా ఊరేగుతారు. ఉదయం 10:30 గంటలకు లక్ష పుష్పార్చన ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు నృసింహ మూలమంత్ర హవనం, హనుమంతుల వాహనాలపై రామావతారం అలంకరిస్తారు. 4వ తేదీ ఉదయం 7.00 గంటలకు మూలాశాస్త్రి హవనం, పూర్ణాహుతి అనంతరం 9.00 నుంచి 9.30 గంటల వరకు సహస్ర కలశాభిషేకం, రాత్రి 7.00 గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావ, మహానివేదన, తీర్థప్రసాద గోష్టి నిర్వహిస్తారు.