రంజాన్ మాసంలో ప్రారంభం..సౌదీ అరేబియాలో చంద్రుడు కనిపించడంతో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అది భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాలలో ఒక రోజు తర్వాత కనిపిస్తుంది. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర దేశాలలో, చంద్రుడు ఒకే రోజున కనిపిస్తాడు. రంజాన్ 2024 చంద్రుడు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో మార్చి 10, 2024న కనిపిస్తారని భావించారు. ఆ తర్వాత రంజాన్ 2024 నెలవంక సౌదీ అరేబియాలో కనిపించింది. కాబట్టి, సౌదీలో పవిత్ర రంజాన్ మొదటి ఉపవాసం మార్చి 11, 2024 సోమవారం నాడు ప్రారంభం అవుతుంది. ఈరోజు నుంచే ఇక్కడి అన్ని మసీదుల్లో తరావీహ్ ప్రారంభమైతుంది.
రంజాన్ 2024 మొదటి ఉపవాసం సోమవారం, మార్చి 11, సౌదీ అరేబియాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, అమెరికా ఆస్ట్రేలియాలో పాటిస్తారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర దక్షిణాసియా దేశాలలో, రంజాన్ ఒక రోజు తరువాత ప్రారంభమవుతుంది. అంటే మార్చి 11 సాయంత్రం నుండి తరావీహ్ నిర్వహిస్తారు. మార్చి 12 న మొదటి రోజాను ఆచరిస్తారు.సౌదీ అరేబియాలో మార్చి 10న రంజాన్ చంద్రుడు కనిపించాడు. కాబట్టి ఇక్కడ మొదటి రోజాను మార్చి 11న ఆచరిస్తారు. భారతదేశం, పాకిస్తాన్లలో, సౌదీ అరేబియా చంద్రుని తర్వాత ఒక రోజు రంజాన్ చంద్రుడు కనిపిస్తాడు. అందుకే ఈ దేశాలలో సౌదీ అరేబియా తర్వాత ఒక రోజు రంజాన్ ఉపవాసం ప్రారంభమవుతుంది.
ఈ ఏడాది భారతదేశంలో రంజాన్ తేదీ 12 మార్చి 2024న చంద్రుని దర్శనంతో రంజాన్ ప్రారంభమవుతుంది. మరుసటి రోజు నుండి ఉపవాసం ఉంటుంది. భారతదేశంలో మొదటి రోజా మార్చి 12 మంగళవారం నాడు జరుపుకుంటారు.
ఇది కూడా చదవండి: ఘనంగా ఆస్కార్ వేడుక.. ఓపెన్ హైమర్‌కు అవార్డుల పంట.!
