కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదన్నారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య. రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై అర్ధసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆ ప్రాజెక్టుతోనే నేడు అనేక జిల్లాలు సస్యశ్యామలమయ్యాయని చెప్పారు. పిల్లర్లు కుంగడం వంటి చిన్న ఘటన జరిగితే మరమ్మతు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. గతంలో అనేక ప్రాజెక్టులు నిర్మించినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. అప్పటికప్పుడు వాటిని మరమ్మతులు చేశారు కానీ రాజకీయాలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పి కొడతారని హెచ్చరించారు పొన్నాల.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వం కూలడం ఖాయం
